కుంటలో పడి వివాహిత మృతి
Published Wed, Aug 24 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
మొగుళ్లపల్లి : మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఓదెల లక్ష్మి(26) ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని ఎల్లయ్యకుంటలో పడి మంగళవారం మృతిచెందింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం లక్ష్మి(26) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలో మంగళవారం బహిర్భూమి కోసమని కుంట వద్దకు వచ్చి అందులో పడి మృతిచెందింది. మృతురాలికి భర్త ఉన్నారు. మృతురాలి తల్లి రామక్క ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఏఎస్సై సురేందర్ తెలిపారు.
Advertisement
Advertisement