నిందితుడికి ఏడాది జైలు శిక్ష | one year prison of bike burnt case | Sakshi
Sakshi News home page

నిందితుడికి ఏడాది జైలు శిక్ష

Published Thu, Apr 6 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

one year prison of bike burnt case

గుంతకల్లు టౌన్‌ : రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పార్కింగ్‌ చేసిన బైక్‌లకు నిప్పు పెట్టిన కేసులో కేరళకు చెందిన జాన్సన్‌ పౌల్‌ అనే నిందితుడికి ఏడాది పాటు జైలుశిక్షతో పాటు రూ.100 జరిమానా విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం వాసుదేవరావు గురువారం తీర్పునిచ్చారని పోలీసులు తెలిపారు. గుంతకల్లు భాగ్యనగర్‌లో గత ఏడాది నవంబర్‌ 7న పార్కింగ్‌ చేసిన బైక్‌లను తగులబెట్టిన కేసులో అతనిపై వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ జడ్జి పై విధంగా తీర్చుచెప్పారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement