- అదనపు ఇంజిన్, బీమా చెల్లించిన వారికే అనుమతి
- జిల్లా కలెక్టర్ ఆదేశాలు
- అఖండ గోదావరి ప్రత్యేక అధికారి భీమశంకరం
- ‘సాక్షి’ కథనానికి స్పందన
రెండు రోజుల్లో పాపికొండల పర్యాటకం
Published Tue, Sep 13 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
రాజమహేంద్రవరం సిటీ:
రెండు రోజుల్లో పాపికొండల పర్యటనకు బోట్లు నడిపేందుకు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారని అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేక అధికారి జి. భీమశంకరరావు పేర్కొన్నారు. పాపికొండల సౌందర్యోపాసకులు పడుతున్న ఆవేదన... బోట్లను నిలిపివేస్తే పర్యాటకానికి ఏర్పడే నష్టం పై ఈ నెల 12న (శనివారం) ‘లాహిరి..లాహిరికి ... బ్రేక్ ’’ శీర్షికన కథనం ప్రచురించడంతో జిల్లా కలెక్టర్ స్పందించారని, రెండు రోజుల్లో పర్యాటక బోట్లకు అనుమతులు ఇరిగేషన్ అధికారుల ద్వారా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు మాట్లాడుతూ బోట్లకు అధనపు ఇంజిన్, బీమా, పర్యాటకులకు బీమాతో ఎవరు ముందుకు వస్తే వారికి బోట్లు నడిపే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. డెఫ్త్ ఇండికేటర్ ఏర్పాటు విషయంలో వేసవి వరకూ అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు
Advertisement
Advertisement