పిల్లల కోసం తల్లిదండ్రులు చదువుకోవాలి
దుగ్గొండి(నర్సంపేట): పిల్లలు చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే వారి తల్లిదండ్రులు మొదట చదువు నేర్చుకోవాల్సిన అవసరముందని బిట్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్య, పాఠశాల అభివృద్ధిపై సదస్సు జరిగింది.
ఈ సదస్సులో పాఠశాల పూర్వ విద్యార్థి అయిన రాజేంద్రప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లల చదువు ఎలా ఉందో తెలియాలంటే తల్లిదండ్రులకు అక్షర జ్ఞానం ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారని, తాను చదువుకున్న పాఠశాలలో నర్సరీ నుండి 2వ తరగతి వరకు నిర్వహణకు సహకరిస్తానని తెలిపారు. సమావేశంలో హెచ్‌ఎంలు దుర్గా ప్రసాద్, శిరోమణి, సర్పంచ్ గోవిందు అనిత, ఎంపీటీసీ మట్ట సుజాతరాజు, సింగిల్‌విండో చైర్మన్ గుడిపెల్లి జనార్ధన్‌రెడ్డితో పాటు శ్రీరామోజు ప్రభాకర్ పాల్గొన్నారు.