టమాటా పంటలో తెగుళ్ల నివారణ ఇలా
Published Fri, Jul 22 2016 4:23 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
కందుకూరు: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతోపాటు వాతావరణంలో తేమ కారణంగా జిల్లా పరిధిలో సాగులో ఉన్న టమాటా పంటలో తెగుళ్లు ఆశించి ఆకుమచ్చ తెగులుతో పాటు కాయలపై మచ్చలు సోకడంతో రైతులు నష్టపోతున్నారు. తెగుళ్ల లక్షణాలు, వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతుల గురించి జిల్లా కృషి విజ్ఞా¯ŒS కేంద్రం వ్యవసాయ నిపుణుడు.శ్రీ కృష్ణ రైతులకు సలహాలు, సూచనలు అందించారు.
తెగులు లక్షణాలు..
– మొక్కల్లో ఆకులు, కాండం మరియు కాయలపై ఈ రోగ లక్షణాలు కనిపిస్తాయి.
– ఆకుల మీద చిన్న చిన్న నీటి మచ్చలు ఏర్పడి తర్వాత గోధుమ రంగులోకి మారి పసుపు పచ్చని వలయాలతో కన్పిస్తాయి.
– నీటి మచ్చలు ఎక్కువగా ఆకుల కొనలు, అంచుల మీద ఏర్పడి 3–5 మి.మీ వరకు పెరుగుతాయి.
– మచ్చలు ఏర్పడిన ప్రదేశం ఎండిపోయి, గోధుమరంగుకు మారి క్రమేపి ఆకంతా ఎండిపోతుంది.
– మచ్చలు ఆకుల అంచుల వద్ద ఏర్పడితే ఆ ప్రదేశాలు రాలిపోతాయి.
– ఈ తెగులు లక్షణాలు ఆకు తొడిమెలు, కొమ్మలు మరియు పచ్చి కాయలపైన కూడా కనిపించవచ్చు.
– పచ్చికాయలపై ముదురురంగు ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. వీటి చుట్టూ నీటి రంగు సరిహద్దులేర్పడతాయి.
– కాయ పరిమాణం పెరిగే కొద్ది, నీటి రంగు సరిహద్దులు మాయమై మచ్చల పరిమాణం పెరిగి ముదురురంగుతో కూడిన మందమైన మచ్చలు ఏర్పడతాయి.
– తెగులు ఆశించిన కాయలు కుళ్లిపోతాయి. కొమ్మలు ఎండిపోతాయి.
తెగులు వ్యాపించే విధానం...
– ఈ బ్యాక్టీరియా విత్తనాన్ని ఆశించి ఉంటుంది. తెగులు సోకిన మొక్కల అవశేషాలపై కూడా జీవించగలదు. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తిస్తుంది.
యాజమాన్య పద్ధతులు ఇలా..
– మంచి సారవంతమైన మురుగు నీటి సౌకర్యం గల నేలలను ఎంపిక చేసుకోవాలి.
– పంట మార్పిడి చేయాలి.
– మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి ముందు మరియు తర్వాత స్టెప్ట్రోసైక్లి¯ŒS 200 పీపీఎం మందును 2 గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
– ఒక లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు 0.2 గ్రాముల స్టెప్ట్రోసైక్లి¯ŒS కలిపి పూత, పిందెకు ముందు పిచికారి చేయాలి.
Advertisement
Advertisement