
ప్యాట్నీ చౌరస్తాలో..
చిలకలగూడ: ఉదయమంతా నగర ప్రజలపై చండప్రచండంగా నిప్పులు కక్కిన సూరీడు సాయంత్రానికి కొంత శాంతించాడు. పడమటి కొండల్లో... ప్రకృతి ఒడిలోకి చేరుకునే వేళ మేఘాల కాన్వాసుపై రమ్యమైన రంగులతో వినూత్న చిత్రాన్ని ఆవిష్కరించాడు. చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. సికింద్రాబాద్ ప్యాట్నీ చౌరస్తాలో కనువిందు చేసిన ఈ మనోహర దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది.
చిత్రం:ఆడెపు నాగరాజు