వికలాంగుడి బలవన్మరణం
Published Tue, Feb 28 2017 11:57 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
నంబులపూలకుంట : నంబులపూలకుంట మండలం నల్లగుట్టపల్లికి చెందిన కిష్టప్ప(30) అనే వికలాంగుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రమేశ్‌బాబు తెలిపారు. తరచూ కడుపునొప్పితో బాధపడుతున్న అతను జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. అంతలోనే ఇంటికొచ్చిన తండ్రి రెడ్డెప్ప గమనించి వెంటనే కుమారుడ్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు నిర్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement