గుప్త నిధుల కోసం బాలికను బలివ్వబోయారా..? | police arrest four people in rajahmundry | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం బాలికను బలివ్వబోయారా..?

Published Sun, May 22 2016 1:03 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

police arrest four people in rajahmundry

రాజమండ్రి క్రైమ్: గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్న నలుగురిని రాజమండ్రిలో పోలీసులు శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడియం మండలం గుర్లంక గ్రామానికి చెందిన గణపతి రాజమండ్రి నారాయణపురంలో ఎఫ్‌సీఐ గోదాముల వెనుక ఓ గది అద్దెకు తీసుకుని ఆరు నెలలుగా నివాసం ఉంటున్నాడు.

ఇతడి దగ్గరకు వెంకన్నదొర (దేవీపట్నం), అమలాపురం పట్టణానికి చెందిన రామ్‌కుమార్, రంపచోడవరం మండలానికి చెందిన కాణెం పార్వతీదేవి, ఆమె కుమార్తె పావని (7) శనివారం వచ్చారు. అర్ధరాత్రి వీరి గదిలో క్షుద్ర పూజలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వారు ఆ ప్రాంతానికి చేరుకుని నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

ఆ సమయంలో బాలిక మగత స్థితిలో ఉండడం, క్షుద్ర పూజలకు సంబంధించిన సామగ్రితోపాటు కత్తి, రెండు గడ్డపారలు కనిపించడంతో బాలికను బలిచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సామానులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement