నాణ్యతతో పెట్రోల్‌ బంకు నిర్వహణ | Police petrol bunk inaugurated | Sakshi

నాణ్యతతో పెట్రోల్‌ బంకు నిర్వహణ

Nov 3 2016 1:38 AM | Updated on Sep 17 2018 6:18 PM

నాణ్యతతో పెట్రోల్‌ బంకు నిర్వహణ - Sakshi

నాణ్యతతో పెట్రోల్‌ బంకు నిర్వహణ

నెల్లూరు(క్రైమ్‌): నాణ్యత ప్రమాణాలతో పోలీస్‌ పెట్రోల్‌బంకును నిర్వహిస్తామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. పోలీస్‌ కవాతు మైదానానికి సంబంధించిన స్థలంలో హిందుస్థాన్‌ పెట్రోలియం సహకారంతో ఏర్పాటు చేసిన పోలీస్‌ పెట్రోల్‌ బంకును బుధవారం ప్రారంభించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు.

  •  ఎస్పీ విశాల్‌ గున్నీ
  •  
    నెల్లూరు(క్రైమ్‌): నాణ్యత ప్రమాణాలతో పోలీస్‌ పెట్రోల్‌బంకును నిర్వహిస్తామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. పోలీస్‌ కవాతు మైదానానికి సంబంధించిన స్థలంలో హిందుస్థాన్‌ పెట్రోలియం సహకారంతో ఏర్పాటు చేసిన పోలీస్‌ పెట్రోల్‌ బంకును బుధవారం ప్రారంభించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందిస్తున్నామని, అదే విధంగా నాణ్యత ప్రమాణాలతో పెట్రోల్, డీజిల్‌ను ప్రజలకు అందిస్తామని చెప్పారు. పెట్రోల్‌ బంకు ద్వారా వచ్చే ఆదాయాన్ని జిల్లా పోలీస్‌ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి వెచ్చిస్తామన్నారు. అనంతరం ఆయనే స్వయంగా పలు వాహనాలకు డీజిల్, పెట్రోల్‌ పట్టారు. అడిషనల్‌ ఎస్పీ శరత్‌బాబు, హెచ్‌పీసీఎల్‌ మేనేజర్‌ సత్యనారాయణ, డిప్యూటీ మేనేజర్లు చంద్రకాంత్, పవన్‌కుమార్, క్రైమ్‌​ఓఎస్డీ 
    విఠలేశ్వర్, డీఎస్పీలు కోటారెడ్డి, జీవీ రాముడు, చెంచురెడ్డి, శ్రీనివాసరావు, సుధాకర్, నిమ్మగడ్డ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement