పోరుమామిళ్ల సీఐ సస్పెన్షన్‌ | Porumamilla ci suspensio | Sakshi
Sakshi News home page

పోరుమామిళ్ల సీఐ సస్పెన్షన్‌

Published Thu, Sep 22 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

Porumamilla ci suspensio

కడప అర్బన్‌: జిల్లాలోని మైదుకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో పోరుమామిళ్ల సీఐగా పనిచేస్తున్న కేఎన్‌ మూర్తిని సస్పెండ్‌ చేస్తూ రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోరుమామిళ్ల పరిధిలో ఇసుక మాఫియాతో కుమ్మక్కై అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఈయనను సస్పెండ్‌ చేసినట్లు రాయలసీమ ఐజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పలువురు లారీ డ్రైవర్లను మామూళ్ల కోసం వేధిస్తుండటంతో వారు ఇతని స్వరాన్ని రికార్డు చేసి ఉన్నతాధికారికి వినిపించినట్లు తెలుస్తోంది. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంలోనూ సీఐపై వచ్చిన ఆరోపణలు సస్పెన్షన్‌కు దారి తీసినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement