ఎం.ప్రణీత్
ఏసీఏ అండర్–23 జట్టుకు ప్రణీత్ ఎంపిక
Published Tue, Sep 20 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రా క్రికెట్ జట్టుకు శ్రీకాకుళానికి చెందిన ఎం.ప్రణీత్ ఎంపికయ్యాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అండర్–23 క్రికెట్ జట్టు జాబితాను మంగళవారం వెల్లడించింది. 14 మంది సభ్యులతో కూడిన తుది జట్టులో ప్రణీత్ చోటు సంపాదించాడు. త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మక అంతర్‌రాష్ట్రాల అండర్–23 క్రికెట్ టోర్నీలో ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మ్యాన్ ఆంధ్రా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే పలు వయో విభాగాల్లో ఆంధ్రా జట్టు తరుఫున ప్రాతినిధ్యం వహించిన ప్రణీత్.. గత సీజన్‌లో అంతర్‌జోనల్, రాష్ట్రపోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో రాణించాడు. దీంతో అండర్–23 జట్టుకు ఏసీఏ ఎంపికచేసింది. ప్రణీత్ ఆంధ్రా జట్టుకు ఎంపిక కావడం పట్ల ఏసీఏ నార్త్‌జోన్ క్రికెట్ కార్యదర్శి, జిల్లా క్రికెట్ ఆపరేషన్స్ ఇన్‌చార్జి జి.వి.సన్యాసినాయుడు, తండ్రి ఎం.యోగేశ్వరరావు, స్థానిక కోచ్‌లు ఆర్సీరెడ్డి, సుదర్శన్, వరహాలు, సీనియర్ క్రికెటర్లు, కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే ఇదే అండర్–23 క్రికెట్ జట్టులో స్టాండ్‌బైగా జిల్లాకు చెందిన ఎల్.రాజశేఖర్‌ను పరిగణలోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement