డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడేళ్ల సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మూడో ఏడాది పరీక్షలు ఈ నెల 15 నుంచి 28 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నవి. డిగ్రీ మొదటి, రెండో ఏడాది పరీక్షలు అక్టోబర్ 1 నుంచి 17 వరకు జరగనున్నాయి. ఇవి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మూడేళ్ల పరీక్షలకు సంబంధించి 25 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటులో అధికారులు అప్రమతంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రశ్నపత్రాల తీకేజీ ఆరోపణలు ఎదుర్కొన్న కళాశాలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి మినహాయించారు. పాలకొండ, పాతపట్నం, కాశీబుగ్గ, సోంపేటలకు సంబంధించి ఆంధ్రాబ్యాంకుల్లో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జీసీఎస్‌ఆర్ రాజాం, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల, మహిళల, శ్రీకాకుళం రూరల్ మండలం గాయత్రి, ఆమదాలవలస, టెక్కలి, నరసన్నపేట, ఇచ్ఛాపురం ప్రభుత్వ కళాశాలల్లో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 79 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగ నున్నాయి. విద్యార్థులు సంఖ్య మేరకు ప్రశ్న పత్రాలు తరలింపు జరగ నుంది.
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ
పరీక్షలు పకడ్బందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు, కళాశాలల కోరిక మేరకు సప్లిమెంటరీ పరీక్షలు న్విహిస్తున్నాం. గతంలో లీకేజీ ప్రచారం జరిగిన ప్రాంతాల్లో ఆంధ్రా బ్యాంకుల్లో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణ పక్కాగా జరుగుతుంది. వర్సిటీ పరిశీలకులు, చీఫ్ సూపరింటెండెంట్‌లు నిరంతరం పరీక్షలు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం పరీక్ష నిర్వహణలో రహస్య పనులు జరుగుతున్నాయి.
– ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, ఎగ్జామినేషన్స్ డీన్, బీఆర్‌ఏయూ