హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ (రెగ్యులర్/ దూరవిద్య) సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ ఆఫ్ కంట్రోలర్ ప్రొ.అప్పారావు గురువారం ప్రకటిం చారు. ఈ పరీక్షలు అక్టోబర్ 15 నుంచి జరుగుతాయని, పరీక్ష ఫీజు అక్టోబర్ 4 వరకు చెల్లించవచ్చన్నారు. వివరాలను వర్సిటీ వెబ్‌సైట్లో చూడవచ్చు.