విదేశాలకు పులివెందుల అరటి
పులివెందుల రూరల్ :
పులివెందుల నుంచి అరటి కాయలు విదేశాలకు ఎగుమతి చేసేందుకుసన్నాహాలు చేస్తున్నామని జార్ఖండ్ ఐఏఎస్ అధికారి (డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్) కె.రవికుమార్ అన్నారు. శనివారం ఎంపీడీవో సభా భవనంలో నియోజకవర్గంలోని అరటి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో పండే అరటి ఎక్కువ రోజుల నిల్వ ఉండటంతోపాటు నాణ్యత కలిగి ఉన్నాయని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ సూచనల మేరకు పరిశీలనకు వచ్చామని చెప్పారు. అరటి కాయలు ఏడాది పొడవునా ఉత్పత్తి, స్థానికంగా ఉన్న మార్కెట్ ధరలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ ట్రేడర్స్ రామలింగం, జిల్లా ఉద్యానవన శాఖ ఏడీ వెంకటేశ్వర్, ఆడిటర్ రవికుమార్, పులివెందుల హెచ్‌వో రాఘవేందారరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.