గోకరాజు కుంట వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో కోతకు గురై మునిగిన మట్టిరోడ్డు
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో మునిగిన పుష్కర రోడ్డు
Published Wed, Aug 10 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
రూ. 1.50 కోట్ల ప్రజా ధనం వృథా
నెహ్రూనగర్(పగిడ్యాల): కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన నెహ్రూనగర్ పుష్కర రోడ్డు శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో మునిగి కొట్టుకుపోయింది. నెహ్రూనగర్ క్రాస్ రోడ్డు నుంచి మూర్వకొండ బురుజులు నది ప్రదేశం వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో బీటీ రోడ్డు, మట్టి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం రూ. 1.50 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులు పూర్తి చేయించారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి కష్ణానదికి వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం డ్యాంకు భారీగా నీరు వచ్చి చేరుకుంది. డ్యాం నుంచి విస్తరించిన బ్యాక్‌వాటర్ గోకరాజు కుంట మీదుగా బురుజుల వరకు వేసిన మట్టిరోడ్డుకు తగిలింది. ఉద్ధతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహానికి రోడ్డు కోతకు గురైంది. అధికారులు అనాలోచితంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి నీటి మునక ప్రదేశంలో రోడ్లు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని స్థానికులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement