అనంతపురం కల్చరల్ : మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం ఆరాధనా ఉత్సవాలు ఆగస్టు 17వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం మొదటి రోడ్డులోని మఠం నిర్వాహకులు ఉత్సవాల వివరాలు తెలిపారు. 17న రుగ్వేద సహిత నిత్యోపాకర్మతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.
18న శ్రావణ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ధ్వజారోహణం, 19 పూర్వారాధనలో ఉదయం నిర్మాల్య విసర్జన, పాదపూజలు, కనకాభిషేకం, తులసి అర్చనలు, రథోత్సవం,20న మధ్యారాధన సందర్భంగా అభిషేకాలు, అలంకార సేవలు, రథోత్సవం, భజన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, 21న మహారథోత్సవం, హస్తోదక సేవలు, 22న సుజ్ఞానేంద్ర తీర్థుల ఆరాధన జరుగుతాయన్నారు.
17 నుంచి రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు
Published Fri, Jul 29 2016 10:10 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM
Advertisement
Advertisement