అనంతపురం టౌన్ : జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)లో రాయదుర్గం ఏపీడీగా పని చేస్తున్న వన్నూరుస్వామి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 'ఇంటింటికీ మొక్కలు' పంపిణీ కార్యక్రమంలో అవినీతి జరిగినట్లు తెలియడంతో ఏపీడీని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారన్నారు. గుమ్మఘట్ట, రాయదుర్గం, కణేకల్లు, బొమ్మనహాళ్ ఏపీఓలకు మెమోలు జారీ చేసినట్లు తెలిపారు.