సబ్సిడీ రుణాలు విడుదల చేయాలి | Release the subsidy loans | Sakshi
Sakshi News home page

సబ్సిడీ రుణాలు విడుదల చేయాలి

Published Thu, Sep 15 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

Release the subsidy loans

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : ఎస్సీ నిరుద్యోగ సబ్సిడీ రుణాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కేవలం పైరవీకారులు, రాజకీయ పలుకబడి ఉన్న వారికే రుణాలు అందిస్తున్నారని విమర్శించారు. బ్యాంక్‌ మేనేజర్లు రుణాల మంజూరులో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం ఎక్కడా కనిపించడం లేదన్నారు. దళితులపై దాడులు పెరిగాయని, అరికట్టకపోవడం దురదృష్టకరమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement