చాపాడు:
మహరాష్ట్ర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలో భారీ వరద నీరు చేరిందని, ఇప్పటికే 856 అడుగులకు పైగా చేరిందని.. ఈ క్రమంలో తక్షణమే కేసీ కెనాల్‌కు సాగునీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఏపీ రైతుసంఘం నాయకులు పేర్కొన్నారు. కేసీ కెనాల్ సాగునీటి విడుదల ఉద్యమంలో భాగంగా సోమవారం చాపాడు తహసీల్దారు వి.పుల్లారెడ్డికి ఏపీ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా శ్రీ శైలం జలాశయంలో భారీగా వరద నీరు 856 అడుగలకు చేరిందని, ఇంకా చేరుతుందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికై ఖరీఫ్‌లో వరిసాగుకు దూరమైన కేసీ రైతాంగానికి తక్షణమే కేసీ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేయాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెంటనే నీటి విడుదలపై ప్రకటన చేయాలన్నారు. శ్రీశైలంలో 875 అడుగుల మేరకు సాగునీటిని నిల్వ చేయాలని, ఆపై వచ్చే నీటిని క్రిందికి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం త్వరగా కేసీ సాగునీటి విడుదలపై ప్రకటన చేస్తే రైతులు వరిసాగు కోసం సంసిద్దమవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవీ రమణ, మండల నాయకులు రామాంజనేయుడు, జిల్లా ఉపాధ్యక్షులు అంకిరెడ్డి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పి.శ్రీరాములు, రైతు సంఘం నాయకులు కేవీ రమణ, పుల్లయ్య, ప్రతాప్‌రెడ్డి, పట్నం వెంకటేశ్వర్లు, షర్పరుద్దీన్, ఇల్లూరు సుధాకర్‌రెడ్డి, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలి
Published Mon, Aug 8 2016 6:12 PM | Last Updated on Fri, May 25 2018 2:48 PM
Advertisement