పంట నష్టంపై కలెక్టర్‌కు వినతి
Published Wed, Jul 27 2016 11:18 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఆదిలాబాద్ కల్చరల్ : వర్షాలకు తమ పంట పొలాలు దెబ్బతిన్నాయని ఆదిలాబాద్ మండలంలోని చించూఘాట్ గ్రామస్తులు బుధవారం కలెక్టర్ ఎం.జగన్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. వాగుపై రోడ్డుడ్యాం పూర్తిగా దెబ్బతినడంతో పక్కనే ఉన్న లక్ష్మీపూర్ గ్రామ చెరువు కూడా దెబ్బతిందని, దీంతో రైతులకు , గ్రామస్తులకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆదుకోవాలని కోరారు. గ్రామస్తులు ఆత్రం పరుసురాం రాజుపటేల్, కె.జంగు, కె.దోందెరావ్, కుమ్ర భానేరావు, పెందోర్‌సోనేరావు, ఆత్రం ఆనంద్‌రావు, దేవిదాస్, భీంరావు, ప్రభు ఉన్నారు.
Advertisement
Advertisement