అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి | Reservation for upper caste poor | Sakshi
Sakshi News home page

అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి

Published Thu, Sep 22 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

Reservation for upper caste poor

  • ధర్మసాగర్‌లో ఓసీ గర్జన.. 
  • భారీ ర్యాలీ
  • ధర్మసాగర్‌ :  అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని, అప్పటి వరకు తమ ఉద్యమం ఆగదని ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి అన్నారు. ధర్మసాగర్‌లో బుధవారం ఓసీ గర్జన మహాసభ నిర్వహించారు. ఓసీ సంక్షేమ సమాఖ్య జెండాను ఎగురవేసిన అనంతరం, తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం  స్థానిక సుశ్మితా గార్డె¯ŒSలో ఏర్పాటు చేసి న సమావేశంలో రామారావు, కేశవరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక పదేళ్ల వరకే రిజర్వేషన్లు వర్తింపజేయాలని రాజ్యాం గంలో పొందుపరిచినప్పటికీ, పాలకులు ఓటు బ్యాం కు రాజకీయాల కోసం దీన్ని పొడిగిస్తున్నారని విమర్శించారు.
     
    రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఓసీల్లోని పేదలకు విద్య, వైద్య, ఉపాధి రంగా ల్లో జనాభా ప్రాతిపదికన 19 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయా లని, స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కోరారు. ఓసీల  స్థితిగతులపై అధ్యయన కమిటీ వేయాలని, రూ.1000 కోట్లతో కార్పోరేష¯ŒS ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 
    ఇతరులకు వ్యతిరేకం కాదు –జంగా రాఘవరెడ్డి
    ఓసీ పేదలకు న్యాయం చేయాలనే తమ ఉద్యమం ఇతర వర్గాల ప్రజలకు వ్యతిరేకం కాదని డీసీసీబీ చైర్మ¯ŒS జంగా రాఘవరెడ్డి అన్నారు. ఓసీ మహాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ కేవలం 10 శాతం మంది దొర అని పిలిపించుకునే వారి వల్లే ఓసీలకు చెడు పేరు వస్తోందని అన్నారు. ఓసీలను ఓసీలో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర  అధ్యక్షుడు జగన్మోçß毌S శర్మ, ఓసీ సంక్షేమ సమాఖ్య నాయకులు గోపు జయపాల్‌రెడ్డి, గూడూరు స్వామిరెడ్డి, కేతిరెడ్డి కవితారెడ్డి, సంది తిరుపతి రెడ్డి, వాణి శివాజిరావు, పెంతల అశోక్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు రావుల రజిత, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు చాడ నర్సింహారెడ్డి, వల్లపురెడ్డి రమణారెడ్డి, రావుల వెంకట్‌రెడ్డి, గుండవరపు రాంచందర్‌రావు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement