scolarships
-
డిగ్రీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త..!
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. భారత దేశాన్ని రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందువరుసలో నిలిపేందుకు, విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశంలోని 100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు తెలిపింది. కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ సైన్సెస్, గణితం & కంప్యూటింగ్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భారత దేశంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్లలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా అవసరం లేదు. రేపటి ప్రపంచ నాయకులుగా మారే అవకాశం ఉన్న భారత ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడం కోసం స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 60 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు గ్రాంట్ అందనుండగా, 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించే పరీక్షలో మెరిట్ ఉన్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ అందించనున్నారు. మొదట 80 శాతం ఫండ్స్ ను కోర్సు ప్రారంభంలో అందిస్తే, మిగతా 20 శాతం మొత్తాన్ని విద్యార్థులు భవిష్యత్ అకాడమిక్ అవసరాల కోసం అందించనున్నారు. 2021లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కంప్యూటర్ సైన్సెస్ కోర్సులో మొదటి సంవత్సరం చదువుతున్న 76 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ఇచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్స్ దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో ఉన్న టాప్ సైన్స్ & ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. అన్ని రకాల సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుంచి దరఖాస్తు దారులను ఆహ్వానిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రిలయన్స్ ఫౌండేషన్ లింకు మీద క్లిక్ చేయండి. (చదవండి: ప్రతి రోజు రూ.44 పొదుపు చేస్తే.. రూ.27 లక్షలు మీ సొంతం..!) -
విద్యార్థినులకు గూగుల్ గుడ్‌న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం "గూగుల్" విద్యార్థినులకు గుడ్‌న్యూస్ తెలిపింది. విద్యార్థినుల కోసం 'జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్' పేరుతో ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయొచ్చు. డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హులు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థినులు 2021 డిసెంబర్ 10లోగా స్కాలర్షిప్ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కాలర్షిప్కు ఎంపికైనవారికి 2022-23 విద్యాసంవత్సరానికి 1000 డాలర్లు అంటే సుమారు రూ.74,000 స్కాలర్షిప్ లభిస్తుంది. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత సాంకేతిక రంగాలలో 2021-22 విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ డిగ్రీని చదువుతున్న ఫుల్ టైమ్ విద్యార్థినుల స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు రెండవ సంవత్సరం చదువుతూ మంచి మార్కులు కలిగి ఉండాలి. ఆసక్తి గల విద్యార్థినులు buildyourfuture.withgoogle.com వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గూగుల్ స్కాలర్షిప్ దరఖాస్తు విధానం ఆసక్తి గల విద్యార్థినులు buildyourfuture.withgoogle.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Scholarship ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్ Asia Pacific ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. నియమ & నిబంధనలు చదివిన తర్వాత APPLY NOW పైన క్లిక్ చేయాలి. తర్వాత గూగుల్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. పేరు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత విద్యార్థినికి సంబంధించిన మరిన్ని వివరాలు, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాతి సెక్షన్లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. రెజ్యూమె, అకడమిక్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్, ఎస్సే ప్రశ్నలకు సమాధానాలు అప్లోడ్ చేయాలి. జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్ ఎంపిక విధానం అందులో నుంచి షార్ట్ లిస్ట్ చేయబడ్డ విద్యార్థినులను 15 నిమిషాల 'మీట్ అండ్ గ్రీట్' సెషన్ కోసం పిలుస్తారు. దీని తర్వాత గూగుల్ ఆన్ లైన్ ఛాలెంజ్ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి 1,000 డాలర్ల స్కాలర్షిప్ లభిస్తుంది. ఏదైనా సందేహాలు ఉంటే గూగుల్ హెల్ప్ లైన్ మెయిల్‌కి మీ ప్రశ్నలు పంపవచ్చు. -
దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు మంగళవారం రికార్డు స్థాయిలో సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ప్రధాని మోదీ హయాంలో అవినీతిపై చేపట్టిన అతిపెద్ద చర్యగా భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ.250 కోట్ల స్కాలర్ షిప్ కుంభకోణానికి సంబంధించి పలు విద్యా సంస్థలపై దాడులు జరిపింది. అదేవిధంగా, యూపీలో రద్దయిన నోట్ల చెలామణీ ఆరోపణలపై నాలుగుచోట్ల సోదాలు జరిపింది. రూర్కెలాలోని బోకారో స్టీల్ ప్లాంట్‌లో అవినీతి కేసులో రాంచీ, బొకారో, కోల్‌కతాలోని అధికారుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ.. అవినీతి, నేర పూరిత ప్రవర్తన, ఆయుధాల స్మగ్లింగ్ తదితర నేరాలకు సంబంధించి 30 కేసులు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆయుధాల లైసెన్స్ జారీలో అక్రమాలకు సంబంధించి 13 చోట్ల సోదాలు చేశామని సీబీఐ తెలిపింది. మంగళవారం ఉదయం ఏకకాలంలో ప్రారంభమైన ఈ సోదాల్లో 500 మంది అధికారులు పాల్గొన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నగదు, నగలతోపాటు పలు బ్యాంకు పత్రాలు, స్థిరాస్తులు, మ్యూచువల్ ఫండ్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. రూ.1,139 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ గత వారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 చోట్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. -
దాసరిగారు మనందరిలో జీవించే ఉన్నారు
‘‘చుట్టూ ఉన్నవారికి సహాయం చేయాలన్న గొప్ప హృదయం ఉన్నవారు మా గురువుగారు దాసరి నారాయణరావు. తండ్రి ప్రారంభించిన ఈ సేవా సంస్థను ఆయన కూతురు హేమాలయ కుమారి, అల్లుడు డా. రఘునాథ్ బాబు కొనసాగించడం నిజంగా హ్యాట్సాఫ్’’ అని దర్శకుడు–నటుడు–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. డాక్టర్ దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ‘నీడ’ తరపున దాసరి కుమార్తె హేమాలయా కుమారి, అల్లుడు డా. రఘునాథ్‌బాబు పలువురికి స్కాలర్షిప్లు అందించారు. కొంకపురి నాటక కళాపరిషత్‌కు 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువునే ఆస్తిగా ఇస్తున్నారు. తన దగ్గర పని చేసిన పిల్లలకు ఆసరాగా నిలుస్తూ, వారి పిల్లల చదువులకు గురువుగారి ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయంటే మా గురువుగారు నిజంగా చిరంజీవే. ఆయన చనిపోలేదు. మనందరిలో జీవించే ఉన్నారు.. ఉంటారు’’ అన్నారు. ‘‘గురువుగారితో నాది ఎన్నో ఏళ్ల అనుబంధం. ఆయన వద్దకు సహాయం కోరి వచ్చే వారిలో ఫ్రాడ్స్ ఉన్నప్పటికీ, వారిని పెద్ద మనసుతో క్షమించి సాయం చేసిన అద్భుతమైన సేవామూర్తి దాసరి నారాయణరావు. ఆయన అందించే స్కాలర్షిప్లను తమ్మారెడ్డి భరద్వాజ, నేను ఫైనలైజ్ చేసేవాళ్లం’’ అన్నారు రేలంగి నరసింహారావు. ‘‘సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నాం అంటుంటారని, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, స్థలాలు కావాలని అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు. నిజమే కావొచ్చు కానీ మా గురువు దాసరిగారు నిజంగానే సేవ చేశారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన కీర్తి అజరామరం. మా గురువుగారి గురించి గిట్టని వాళ్లు ఎన్ని చెప్పినా ముమ్మాటికీ ఆయన సేవ చేశారు. తెలియకుండా ఎంతోమందికి దాన ధర్మాలు చేశారు. మా దృష్టిలో ఆయన ఎప్పటికీ దేవుడే. దాసరిగారి సేవలను ఆయన కూతురు, అల్లుడు కొనసాగించడం ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లతోపాటు సినీరంగ ప్రముఖులు ధవళ సత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి
ధర్మసాగర్లో ఓసీ గర్జన.. భారీ ర్యాలీ ధర్మసాగర్ : అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని, అప్పటి వరకు తమ ఉద్యమం ఆగదని ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి అన్నారు. ధర్మసాగర్లో బుధవారం ఓసీ గర్జన మహాసభ నిర్వహించారు. ఓసీ సంక్షేమ సమాఖ్య జెండాను ఎగురవేసిన అనంతరం, తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం స్థానిక సుశ్మితా గార్డె¯ŒSలో ఏర్పాటు చేసి న సమావేశంలో రామారావు, కేశవరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక పదేళ్ల వరకే రిజర్వేషన్లు వర్తింపజేయాలని రాజ్యాం గంలో పొందుపరిచినప్పటికీ, పాలకులు ఓటు బ్యాం కు రాజకీయాల కోసం దీన్ని పొడిగిస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఓసీల్లోని పేదలకు విద్య, వైద్య, ఉపాధి రంగా ల్లో జనాభా ప్రాతిపదికన 19 శాతం రిజర్వేషన్ కల్పించాలని, సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయా లని, స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరారు. ఓసీల స్థితిగతులపై అధ్యయన కమిటీ వేయాలని, రూ.1000 కోట్లతో కార్పోరేష¯ŒS ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇతరులకు వ్యతిరేకం కాదు –జంగా రాఘవరెడ్డి ఓసీ పేదలకు న్యాయం చేయాలనే తమ ఉద్యమం ఇతర వర్గాల ప్రజలకు వ్యతిరేకం కాదని డీసీసీబీ చైర్మ¯ŒS జంగా రాఘవరెడ్డి అన్నారు. ఓసీ మహాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ కేవలం 10 శాతం మంది దొర అని పిలిపించుకునే వారి వల్లే ఓసీలకు చెడు పేరు వస్తోందని అన్నారు. ఓసీలను ఓసీలో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోçß毌S శర్మ, ఓసీ సంక్షేమ సమాఖ్య నాయకులు గోపు జయపాల్‌రెడ్డి, గూడూరు స్వామిరెడ్డి, కేతిరెడ్డి కవితారెడ్డి, సంది తిరుపతి రెడ్డి, వాణి శివాజిరావు, పెంతల అశోక్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు రావుల రజిత, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చాడ నర్సింహారెడ్డి, వల్లపురెడ్డి రమణారెడ్డి, రావుల వెంకట్‌రెడ్డి, గుండవరపు రాంచందర్‌రావు పాల్గొన్నారు.