జిల్లాలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం
జిల్లాలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం
Published Wed, Nov 23 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
ఏలూరు: రూ..5కోట్ల వ్యయంతో జిల్లాలోని కొవ్వలిలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున అధిక దిగుబడి సాధించే చేపల ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రాధాన్యతా రంగాలు అభివృద్ధి తీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మపుత్ర నదిలో మేలుజాతి చేపపిల్లలను సేకరించి జాతీయ స్థాయి ప్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సంస్థ సాంకేతిక సలహాలతో జన్యుపరంగా ఎటువంటి వైరస్ లేని మత్స్య సంపదను జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు దెందులూరు మండలం కొవ్వలిలో 23 ఎకరాల విస్తీర్ణంవలో ఆడ, మగ చేపలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
తద్వారా ఈ చేపల సంతతిని జిల్లాలోని రైతులకే కాకుండా ఇతర జిల్లాల రైతులకు కూడా సరఫరా చేసే స్థాయి కొవ్వలి చేపల పిల్లల కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. చేపల చెరువుల్లో నీటి పరీక్షలు, మట్టి పరీక్షలు నిర్వహిచేందుకు ప్రతేయక మొబైల్ లాబ్‌లు కూడా ఏరాపటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఉద్యానవన శాఖ పరిధిలో 1.20లక్షల ఎకరాల వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉండగా ఇంత వరకూ 1.12 లక్షల ఎకరాలు పూర్తయిందనీ, మిగిలిన రెండు వేల ఎకరాల వివరాలు రెండురోజుల్లో డేటా ఎంట్రీ పూర్తి చేయాలని, భవిష్యత్‌లో కొత్తగా ఉద్యానవన పంటలు వేసేవారి వివరాలను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయాలని కలెక్టర్ చెప్పారు. మండలానికి ఒక రైతు బజార్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే మార్కెటింగ్ శాఖ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని కలెక్టర్ ప్రశ్నించారు. రైతుల వద్ద నుండి సేకరించిన పాలకు ఏరోజుకారోజే ఆన్‌లైన్ రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, సిపిఒ బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సాయిలక్ష్మీశ్వరి, మత్స్యశాఖ డిడి యాకోబ్‌భాషా, మార్కెటింగ్‌శాఖ ఎడి కె.ఛాయాదేవి, మైక్రో ఇరిగేషన్ పిడి రామ్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement