వివాహ విందుకు వెళుతూ... | road accdent, 13 people injured | Sakshi

వివాహ విందుకు వెళుతూ...

Apr 3 2016 6:52 PM | Updated on Jul 11 2019 8:03 PM

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న గోతిలో డీసీఎం వ్యాను బోల్తా పడింది.

ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న గోతిలో డీసీఎం వ్యాను బోల్తా పడింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా వారిని సామాజిక ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఏటూరు నాగారం మండలం ముప్పనపల్లి గ్రామానికి చెందిన సంగెం వెంకటేశ్వర్లు కుమార్తు రోజా వివాహం శనివారం జరిగింది. దీంతో వివాహ విందు కోసం గాను వధువు తరఫు బంధువులు డీసీఎం వాహనంలో కరీంనగర్ జిల్లా కాటారం మండలం ఎడ్లపల్లి గ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement