తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల అతిథి గృహంలో చోరీ జరిగింది. కర్నూలుకు చెందిన భక్తులు సన్నిధానం అతిథిగృహంలో బుధవారం రాత్రి బస చేశారు. గురువారం ఉదయం గదికి తాళం వేసి టిఫిన్ చేసేందుకు బయటకు వెళ్లారు. గంట తర్వాత తిరిగి వచ్చేసరికి వారు ఉన్న గది తాళం పగలగొట్టి ఉంది.
అతిథిగృహం గదిలో ఉంచిన రూ.2 లక్షల నగదు కనిపించలేదు. దీంతో బాధితులు వెంటనే తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజిలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.