‘సాక్షి’ముగ్గుల పోటీలకు స్పందన | Sakshi Media Group rangolis competitions | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ముగ్గుల పోటీలకు స్పందన

Published Mon, Jan 9 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

‘సాక్షి’ముగ్గుల పోటీలకు స్పందన

‘సాక్షి’ముగ్గుల పోటీలకు స్పందన

కరీంనగర్‌ కల్చరల్‌ : సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థ ప్రాంగణంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. సాక్షి అడ్వర్టయిజ్‌మెంట్‌ రీజినల్‌ మేనేజర్‌ శ్రీరాం శ్రీనివాస్‌ పోటీలను ప్రారంభించారు. కరీంనగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ వైద్య శ్రీనివాస్‌ çమాట్లాడుతూ సృజనకు పదునుపెడుతూ సందేశాత్మకంగా నిర్వహించిన ఈ పోటీలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తాయన్నారు. న్యాయనిర్ణేతలుగా కార్పొరేటర్‌ చొప్పరి జయశ్రీ, సాయిశరణ్య హాస్పిటల్‌ వైద్యురాలు శేషశైలజ, స్రీ వైద్య నిపుణురాలు రేఖారాణి, వివేకానంద విద్యానికేతన్  విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య సతీమణి రాజేశ్వరి వ్యవహరించారు.

టీఎన్ జీవో కేంద్ర సంఘం నాయకులు సుద్దాల రాజయ్యగౌడ్‌ మాట్లాడుతూ ‘సాక్షి’ పత్రిక మహిళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ప్రథమ బహుమతి తారకు రూ.6వేల నగదును సుద్దాల నర్సయ్యగౌడ్‌ స్మారకార్థం ఆయన కుమారులు రాజయ్యగౌడ్‌ అందజేశారు. ద్వితీయ బహుమతి ఇందూకు రూ.4వేలను సాయిశరణ్య హాస్పిటల్‌ తరఫున డాక్టర్‌ ఎల్‌.శేషశైలజ, తృతీయ బహుమతి లక్ష్మి విద్యుల్లతకు రూ.3వేల నగదును న్యూశ్రీనివాస మెడిసిన్స్ తరఫున విమలరవిగుప్త, ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిగా రూ.వెయ్యి సౌఖ్యశ్రీకి ఏఆర్‌ విజన్స్  యాడ్‌ ఏజెన్సీ తరఫున ఎలగందుల రవీందర్‌ అందజేశారు. ప్రోత్సాహక బహుమతులను జగదాంబ పెరల్స్‌ యజమానులు సూర శ్రీనివాస్, ఎలగందుల రవీందర్‌ తరఫున వివేకానంద విద్యానికేతన్  విద్యాసంస్థల చైర్మన్  సౌగాని కొమురయ్య సతీమణి రాజేశ్వరి, డాక్టర్‌ రేఖరాణి, డాక్టర్‌ శేషశైలజ, చొప్పరి జయశ్రీ, విమల గుప్తా అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ జగదాంబ పెరల్స్‌ వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

కేఎస్‌.అనంతాచార్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంగీత దర్శకులు, గాయకులు కేబీ శర్మ, గాయకులు కనపర్తి శ్రీనివాస్, శివ హర్షిత, ఓదెలు, కె.సుదర్శన్ తమ పాటలతో అలరించారు. ఈ పోటీల నిర్వహణలో అడ్వర్ట్‌యిజ్‌మెంట్‌ మేనేజర్‌ ఊరగొండ లక్షి్మనారాయణ, సాక్షి టీవీ జిల్లా ప్రతినిధి కట్కూరి విజేందర్‌రెడ్డి, సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ గుంటపల్లి స్వామి, సీనియర్‌ కెమెరామెన్ సాయిని సతీశ్, అడ్వర్టయిజ్‌మెంట్‌ విభాగం పట్టణ ఇన్ చార్జి ముస్కుల విద్యాసాగర్‌రెడ్డి, గంగుల మహేందర్‌రెడ్డి, అడ్వర్టయిజ్‌మెంట్‌ ఇన్ చార్జీలు యెలిగేటి కమలాకర్, పొన్నాల ప్రవీణ్, వేముల శ్రీనివాస్, పూసాల శ్రీకాంత్, బరిగెల ఆంజనేయులు, అవుదుర్తి శ్రీనివాస్, మొదుంపల్లి సుమన్, గడ్డం చిరంజీవి, లక్ష్మణ్‌రావు, వి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌ను ప్రారంభించిన ఎంపీ  
పెద్దపల్లి: పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌ను ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఐడీసీ చైర్మన్  ఈద శంకర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాల్క సుమన్  మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ప్రతీ మండలంలో పనిచేస్తున్న పాత్రికేయులకు పక్కాఇళ్లు నిర్మిస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్‌క్లబ్‌ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామన్నారు. పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాలలాంటి పధాన పట్టణాల్లో ఆకర్షణీయంగా  ప్రెస్‌ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం తన నిధుల నుంచి రూ. 10లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని దాదాపు 200మంది పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రెస్‌భవన్ కు కావాల్సిన నిధులు ఇచ్చేందుకు ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అంగీకరించారు. నగర పంచాయతీ చైర్మన్ ఎల్‌.రాజయ్య, రామగుండం కార్పొరేషన్  మేయర్‌ కొంకటి లక్షీ్మనారాయణ, నాయకులు ఆడెపు రమేశ్, మార్కెట్‌ చైర్మన్ ఐలయ్యయాదవ్, రఘువీర్‌సింగ్, ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు రవికిశోర్, కొట్టె సదానందం, తిరుపతి, సంపత్, శ్రీమాన్, రమేశ్, అశోక్, రాజు, గోపీ, మధు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement