సేమ్ సీన్..!
సాక్షి, యాదాద్రి : తెలుగుదేశం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ పదవి కోసం కొట్లాట మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు శిబిరాలు నడిపిన మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి యాదాద్రిభువనగిరి జిల్లాలోనూ పట్టుకోసం పోరుకు తెరలేపారు. జిల్లా కన్వీనర్ ఎన్నిక కోసం పార్టీ జాతీ య కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో జరిగిన జిల్లాస్థాయిసమావేశంలో ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
దశాబ్దాలుగా గ్రూప్ తగాదాలు
ఎన్టీఆర్, బాబు కాలంనుంచి నల్లగొండ జిల్లాలో భువనగిరి డివిజన్‌కు చెందిన నర్సిం హులు, మాధవరెడ్డి మధ్య గ్రూప్ తగాదాలు ఉన్నాయి. మాధవరెడ్డి మరణానంతరం మో త్కూపల్లి, ఉమామాధవరెడ్డి రెండు గ్రూపులు గా విడిపోయారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
తాజాగా..
తాజాగా జిల్లాల విభజన జరుగడంతో ఉమ్మడి నల్లగొండ నుంచి విడిపోయిన యాదాద్రిభువనగిరి జిల్లాలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం కోసం అడహక్ కమిటీని నియమించేందుకు సమావే శం నిర్వహించారు. కన్వీనర్ పదవి కోసం మో త్కుపల్లి తన రాజకీయ వారసురాలిగా టీడీపీ రాష్ర్ట తెలుగుమహిళా అధ్యక్షురాలు ఆలేరు నియోజకవర్గానికి చెందిన బండ్రుశోభారాణి పేరు సూచించారు. ఎలిమినేటి మాధవరెడ్డి రాజకీయ వారసుడిగా ఉమామాధవరెడ్డి ఆమె కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి పేరును ప్రతిపాదించారు. 16 మండలాలున్న జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల అధ్య క్షులు శోభారాణి పేరు, మరో ఎనిమిది మండలాల అధ్యక్షులు సందీప్‌రెడ్డి పేరును ప్రతి పాదించడంతో బలాబలాలు సమానమయ్యాయి. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరు పేర్లను తీసుకుని ప్రకాశ్‌రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలుప్పుడే మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి రెండు ప్రధాన శిబిరాలు నిర్వహించారు. పార్టీ వేదికలపైన సైతం ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించలేదు.ఏ విషయంలోనైనా ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరించిన వీరు యా దాద్రిభువనగిరి జిల్లాకు చెందిన ప్రధాన నాయకులు కావడం విశేషం. అయితే సం దీప్‌రెడ్డికి పెద్దగారాజకీయానుభవం లేదంటుండగా, శోభారాణికి ఇప్పటికే టీడీపీ మహిళా అధ్యక్ష్య పదవి ఉందన్న వాదన ఉంది. ఈ దశ లో జిల్లా అధ్యక్ష్యపదవికోసం పోటీపడుతున్న ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి కన్పించడంలేదు.