సింహగిరికి రెండో ఘాట్‌రోడ్డు | second ghat road at simhagiri | Sakshi
Sakshi News home page

సింహగిరికి రెండో ఘాట్‌రోడ్డు

Published Fri, Jul 22 2016 4:47 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

సింహగిరికి రెండో ఘాట్‌రోడ్డు - Sakshi

సింహగిరికి రెండో ఘాట్‌రోడ్డు

సింహాచలం: సింహగిరికి వెళ్లే ప్రస్తుత ఘాట్‌రోడ్డులో రోజురోజుకీ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం జరుగుతోంది. హనుమంతవాక జంక్షన్‌ నుంచి సింహాచలం వెళ్లే బీఆర్‌టీఎస్‌ మార్గంలోని పాత అడవివరం వద్ద మహాత్మా జ్యోతీబాఫూలే బీసీ గురుకుల పాఠశాలకి సమీపంలోంచి  ఈ రెండో ఘాట్‌రోడ్డు ప్రారంభం కానుంది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే దీనికి శంకుస్థాపన జరిగినా పనులు మధ్యలో నిలిచిపోయాయి.  ప్రస్తుతం తిరిగి ఘాట్‌ రోడ్డు నిర్మాణం వేగం పుంజుకుంది.
 సింహగిరికి రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులకు 2013 డిసెంబరు 11న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. మొత్తం 1.3 కిలో మీటర్లు పొడవు ఉండే ఘాట్‌రోడ్డు నిర్మాణానికి ఇక్కడి తోటల్లోంచి రోడ్డు ఫౌర్మేషన్‌ చేయడానికి, కల్వర్టులు నిర్మాణానికి తొలుత రూ.1.8 కోట్ల పనులకు దేవస్థానం టెండర్లు పిలిచింది. ఏడాదిలో పనులు పూర్తికావాలని సమయం నిర్దేశించింది. కానీ కాంట్రాక్టరు గడువు సమయానికి సగం పనులే చేసి వెళ్లి పోవడంతో దేవస్థానం అతని టెండరుని రద్దుæ చేసింది. అప్పటి నుంచి కొంతకాలం పనులు నిలిచిపోయాయి. అలాగే ప్రణాళిక కూడా మారుతూ వచ్చింది. 2016 మార్చిలో మళ్లీ రోడ్డు ఫార్మేషన్, బీటీ రోడ్డు నిర్మాణం, కల్వర్టులు, సైడ్‌ డ్రై న్స్, రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణానికి రూ.3.3 కోట్లకి దేవస్థానం టెండర్లు పిలి చింది. ప్రస్తుతం మూడు నెలలు గా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా ఘాట్‌రోడ్డుని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 
సింహాచలం రాకుండానే 
సింహగిరికి!
రెండో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంలోంచి హనుమంతవాక మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డులో వచ్చేవారు సింహాచలం రాకుండానే నేరుగా సింహగిరికి చేరుకోవచ్చు. గురుకుల పాఠశాల నుంచి ప్రారం¿¶ మయ్యే ఘాటోరోడ్డులోకి ప్రవేశించి నేరుగా శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి దర్శనానికి సింహగిరికి వెళ్లవచ్చు. దీంతో అక్కడి నుంచి సింహాచలం వచ్చే మూడు కిలోమీటర్లు దూరం తగ్గుతుంది.
ఘాట్‌రోడ్డు ఇలా : సింహాచలంలోని టోల్‌గేట్‌ నుంచి సింహగిరికి ఐదు కిలోమీటర్లు మేర ప్రస్తుత ఘాట్‌రోడ్డు ఉంది. అటు హనుమంతవాక నుంచి కానీ, ఇటు గోపాలపట్నం నుంచి కానీ ఏ వాహనమైనా ఈ ఘాట్‌రోడ్డులోంచి వెళ్లాల్సి వస్తోంది. హనుమంతవాక నుంచి సింహాచలం వచ్చే బీఆర్‌టీఎస్‌ రోడ్డులో గురుకుల పాఠశాల వద్ద నుంచి ప్రారంభమయ్యే 1.3 కిలోమీటర్ల రెండో ఘాట్‌రోడ్డుని ప్రస్తుతం ఉన్న ఘాట్‌రోడ్డులోని ఎన్‌టీఆర్‌ఘాట్‌వద్ద కలుపుతారు. దిగువకి వచ్చినప్పడు కూడా నగరంలోకి వెళ్లే వాహనాలు ఇక్కడ నుంచి వేరుకావచ్చు. అలాగే సింహగిరికి రద్దీ నెలకొనే సమయాల్లో కొత్త ఘాట్‌రోడ్డులోంచి వాహనాలకు కొండపైకి చేరుకునేలా, పాత ఘాట్‌రోడ్డులోంచి కిందకి చేరుకునేలా కూడా ప్రణాళిక చేశారు.
పలు అభివద్ధి పనులు కూడా...
కొత్తఘాట్‌రోడ్డు ప్రారంభమయ్యే ప్రదేశంలో దేవస్థానం పలు అభివద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టనుంది. దేవస్థానం పరిపాలనా భవనం, భక్తులు వేచి ఉండేందుకు డార్మెటరీలు, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ స్థలాలు, వేద పాఠశాల, కల్యాణ మండపాలు నిర్మాణానికి ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌లో రూపొందించారు. అలాగే ఇక్కడే మార్కెట్‌ సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement