కళాశాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి | seize College assets | Sakshi
Sakshi News home page

కళాశాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

Published Wed, Sep 14 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

కళాశాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

కళాశాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

కామారెడ్డి రూరల్‌ :
కామారెడ్డి డిగ్రీ కళాశాలకు చెందిన ఆస్తుల స్వాధీన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలని విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. టీఎన్‌ఎస్‌ఎఫ్, టీజీవీపీ, టీజీవీపీ(ఎన్‌), బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ఆవరణలో బుధవారం సమావేశం నిర్వహించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాలు మాట్లాడుతూ.. కళాశాల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించి సంవత్సరం గడిచిన ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం కామారెడ్డిని నూతన జిల్లాగా ప్రకటించినందున భవిష్యత్తులో నూతన విద్యాసంస్థలు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల రూ. కోట్ల విలువ చేసే భూముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడనాడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ చొరవ తీసుకుని స్వాధీన ప్రకియను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కొందరూ తప్పుడు పత్రాలను సృష్టించి కళాశాల భూములను తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోమారు పోరు బాట పట్టడానికి విద్యార్థి సంఘాలు వెనకడవన్నారు. సమావేశంలో టీజీవీపీ(ఎన్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మన్, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్, బీసీ విద్యార్థి సంఘం డివిజన్‌ ఇంచార్జీ నాగరాజు, అజాం తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

పోల్

Advertisement