
‘సెల్ఫీరాజా’ సందడి
హీరో అల్లరి నరేష్, హీరోయిన్ సాక్షి చౌదరి హాజరు
హన్మకొండ చౌరస్తా : ఈ నెల 15న విడుదల కానున్న ‘సెల్ఫీరాజా’ చిత్ర బృందం ఆదివారం హన్మకొండలోని ఏషియన్ శ్రీదేవి మాల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ‘ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్’ అనే పాటను లాంచ్ చేశారు. అనంతరం హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని మూడు పాటలను శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, నాలుగో పాటను వరంగల్‌లో ఆవిష్కరించినట్లు చెప్పారు.
సెల్ఫీలతో హీరోలకు వచ్చిన కష్టాలను చూపెట్టడమే ఈ చిత్రమని అన్నారు. కార్యక్రమంలో హీరోయిన్ సాక్షి చౌదరి, నటుడు పృథ్వీ, దర్శకుడు ఈశ్వర్ రెడ్డి, మాటల రచయిత డైమండ్ రత్నం, కమెడియన్లు తాగుబోతు రమేశ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర పాల్గొన్నారు.