రాజంపేట టౌన్: విధులకు సక్రమంగా హాజరు కాని రాజంపేట ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావుతో విధులకు సక్రమంగా హాజరు కాని ప్రసాద్, నవీన్‌లను సస్పెండ్ చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుధవారం ప్రభుత్వ ఐటీఐ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నెలకు ఐదు రోజులు కూడా ఐటీఐకి రాడని, అలాగే ప్రసాద్, నవీన్‌లు కూడా ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం 3 గంటలకు ఇంటికి వెళుతున్నారని ఆరోపించారు. ఇందువల్ల విద్యార్థుల సరైన బోధన అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారు ఆరోపించారు. అంతేకాక ఐటీఐ అంటే ప్రాక్టికల్స్‌లో ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని, అయితే ప్రాక్టికల్స్‌కు సంబంధించిన పరికరాలు పూర్తిస్థాయిలో లేక పోవడంతో విద్యార్థులు ఐటీఐ ఉత్తీర్ణులైనా బయటికి వెళ్ళి ఉద్యోగ అవకాశాలను పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి ఫలితం లేదన్నారు. వెంటనే పై సమస్యలను పరిష్కరించకుంటే డిసెంబర్ 4వ తేదీ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరసింహ, లక్ష్మీనారాయణ, టీ.ప్రసాంత్, విజయ్, గంగిరెడ్డి, గురు, బాలక్రిష్ణ, రెడ్డయ్య, భాను తదితరులు పాల్గొన్నారు.
ఐటీఐ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి
Published Thu, Dec 1 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
Advertisement
Advertisement