స్పిర్చ్యువల్‌ సైన్స్‌ అకాడమి కన్వీనర్‌గా శేషారెడ్డి | shesha reddy appointed in spirutual science acadamy conviner | Sakshi
Sakshi News home page

స్పిర్చ్యువల్‌ సైన్స్‌ అకాడమి కన్వీనర్‌గా శేషారెడ్డి

Published Fri, Dec 16 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

shesha reddy appointed in spirutual science acadamy conviner

కడప కల్చరల్‌: పిరమిడ్‌ స్పిర్చ్యువల్‌ సొసైటీ ఆధ్వర్యంలోని పిరమిడ్‌ స్పిర్చ్యువల్‌ సైన్స్‌ అకాడమి వైఎస్సార్‌ జిల్లా కన్వీనర్‌గా కడప నగరానికి చెందిన ప్రొఫెసర్‌ జీవీ శేషారెడ్డిని నియమించినట్లు  ఆ ప్రాజెక్టు రాష్ట్ర కోఆర్డినేటర్‌ కంచి రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన శేషారెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా యోగా, ధ్యానాన్ని బోధించేందుకు స్పిర్చ్యువల్‌ సైన్స్‌ అకాడమిని ఏర్పాటు చేశామని, ఆ ప్రాజెక్టు ఆధ్వర్యంలో విద్యాలయాల్లో యోగ, ధ్యాన తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. తన నియామకంపై శేషారెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో విద్యార్థులకు యోగా, ధ్యానాలను నేర్పేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement