యాగంటిలో కొనసాగుతున్న సినిమా షూటింగ్
యాగంటిక్షేత్రం(బనగానపల్లె రూరల్): యాగంటి శ్రీ ఉమామేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం ప్రారంభించిన ‘నేనేరాజు
.. నేనే మంత్రి’ సినిమా షూటింగ్ సోమవారం కూడా కొనసాగింది. తేజా దర్శకత్వంలో డి. సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి హీరో రాణా, హీరోయిన్ కాజల్‌పై ఆలయంలో పూజా సన్నివేశాలను షూటింగ్ చేశారు. షూటింగ్ సందర్భంగా బనగానపల్లె సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు రాకేష్, సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.