ముగిసిన షూటింగ్
బనగానపల్లె రూరల్: మండలంలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. బుధవారం ఫతేనగర్ గ్రామ సమీపంలోని ఎతైన మలుపు రోడ్డు వద్ద హీరో రానా, హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే సాయంత్రం మిట్టపల్లె సమీపంలోని వ్యవసాయ పొలంలో హీరో, హీరోయిన్‌కు సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరించారు. షూటింగ్‌లో చిత్ర దర్శకులు తేజతో పాటు పలువురు, ఆర్టిస్టులు పాల్గొన్నారు.