జనగామ (వరంగల్) : హాస్టల్‌లో ఉంటున్న సీనియర్ ఇంటర్ విద్యార్థి ఉమేశ్ మృతి ఘటనపై ఉన్నత విద్యాశాఖ స్పందించి షోకాజ్ నోటీసు జారీ చేసింది. వరంగల్ జిల్లా జనగామలోని వాగ్దేవి జూనియర్ కళాశాల, హాస్టళ్లను ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి(ఆర్‌ఐవో) హైమద్ నేతృత్వంలో సోమవారం పరిశీలించారు. హాస్టల్‌లో దాడి జరిగి విద్యార్థి మృతి చెందేవరకూ ఇంటర్ బోర్డుకు సమాచారం లేకపోవడంపై సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కళాశాలను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కళాశాల డెరైక్టర్ రమేశ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు.
యాజమాన్యం నుంచి సమాధానం రాకుంటే కాలేజీని సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాగ్దేవితో పాటు జనగామ పట్టణంలో మరో ఐదు ప్రెవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అనుమతి లేకుండా హాస్టళ్లను నడిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. హాస్టళ్లను మూసి వేయకుంటే కళాశాలల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. కాగా, వాగ్దేవి కళాశాలను, హాస్టల్‌ను యూజమాన్యం మూసివేసినట్లు సమాచారం. దీంతో పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వాగ్దేవి కళాశాలకు షోకాజ్ నోటీసులు
Published Mon, Jul 11 2016 6:57 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement