ఏపీకార్ల్‌లో సోలార్‌వెలుగులు
పులివెందుల రూరల్ :
పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న ఆంధ్రప్రదేశ్ అత్యున్నతస్థాయి పరిశోధన కేంద్రం (ఏపీ కార్ల్)లో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. దాదాపు 655 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ కార్ల్‌లలో పరిశోధనకు సంబంధించిన మౌళిక వసతులు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం విద్యుత్ లైట్ల ఏర్పాటుకు బిల్లులు అధికంగా వస్తుండటంతో చాలావరకు వెలుగుకు నోచుకోవడంలేదు. ముఖ్యమైన ప్రాంతాల్లో 100పాయింట్లల్లో రెనవబుల్ కంపెనీకి చెందిన సోలార్ లైట్లు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ15లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులు ఈనెల 10వ తేదీలోపు పూర్తయ్యే అవకాశం ఉంది.
సోలార్ ఏర్పాటు మంచి నిర్ణయం :
ఏపీ కార్ల్‌ల్లో సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం మంచి నిర్ణయం. దీనివల్ల ప్రధాన వీధుల్లో రాత్రిపూట వెలుగునిస్తాయి. ఇది ఏపీ కార్ల్‌కు శుభపరిమాణంగా చెప్పవచ్చు.
– మహబూబ్ బాషా(ఏపీ కార్ల్ డిప్యూటీ సీఈవో), పులివెందుల