అటవీశాఖ కార్యాలయంలో శ్రమదానం | sramadanam in Forest Department office | Sakshi
Sakshi News home page

అటవీశాఖ కార్యాలయంలో శ్రమదానం

Published Thu, Jan 5 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

అటవీశాఖ కార్యాలయంలో శ్రమదానం

అటవీశాఖ కార్యాలయంలో శ్రమదానం

సిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో బుదవారం అధికారులు, సిబ్బంది శ్రమదానం చేశారు. కార్యాలయంలోని చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సుష్మారావు మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌లో భాగంగా కార్యాలయ ఆవరణలో ఉన్న చెత్తను పనికి రాని వాటిని తొలగించామని తెలిపారు. కార్యాలయం ఎదుట అనధికారికంగా కొందరు టీస్టాల్స్‌తో పాటు పలు వ్యాపారాలు చేసి వాటి వల్ల వచ్చే వ్యర్థాలను వదిలివేయడంలో పరిసర ప్రాంతాలు పాడవుతున్నాయన్నారు. మురుగుకాల్వలో టీగ్లాస్‌లతోపాటు పలు వ్యర్థాలు ఉండి దుర్గంధంతో దోమల బెడద అధికమైందన్నారు. వీటిని తొలగించాలని మున్సిపల్‌ అధికారులకు తెలిపినా సిబ్బంది నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే కార్యాలయంలో గార్డెనింగ్‌ చేయాలన్న కోణంలో పైఅధికారులు మౌఖిక ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement