మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి
-
వైఎస్సార్‌సీపీ జిల్లా అ«ధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి
మహబూబ్‌నగర్ అర్బన్ : పార్టీని బలోపేతం చేయడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక న్యూటౌన్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగయ్యాయని ఆరోపించారు. సమస్యల సాధనకు తమ పార్టీయే ప్రతిపక్షంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. మహానేత దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబంపై ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీ చేయలేదని, ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేదన్నారు. దసరా తర్వాత జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు, ఆర్‌డీఎస్‌ను సందర్శించి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొంటారన్నారు.
సీఎంది షోపుటప్
అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఈసీ సభ్యుడు జి.రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పాలనాపరంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ షోపుటప్ చేస్తున్నారని, ఆయన తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో పిట్టలదొర రాజ్యం నడుస్తోందని, 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మూల్యం చెల్లించక తప్పదన్నారు. సమావేశంలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు జెట్టి రాజశేఖర్, ఇందిర, హైదర్‌అలీ, మిట్టమీది నాగరాజు, నిరంజన్‌రెడ్డి, బుచ్చన్నయాదవ్, రాష్ట్ర, జిల్లా నాయకులు శేఖర్ పంతులు, గంగాధర్, మరియమ్మ, మహ్మద్ వాజిద్, నసీర్, షేక్‌అబ్దుల్లా, ఇబ్రహీం, జహంగీర్‌పాషా, కోస్గి బాల్‌రాజు, అబ్దుల్‌జబ్బార్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.