రఘుపతికి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు
Published Thu, Sep 8 2016 1:08 AM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM
విద్యారణ్యపురి : వరంగల్‌లోని ఏవీవీ కళాశాల ప్రిన్సిపాల్ డి.రఘుపతికి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. వరంగల్ సీకేఎం కళాశాలలో 1989–1992వరకు పార్ట్‌టైం కామర్స్ లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఏవీవీ జూనియర్ కళాశాలలో 1995లో జూనియర్ లెక్చరర్‌గా చేరి ప్రస్తుతం ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సింహాలపేట మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన రఘుపతి గురువారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తారు.
Advertisement
Advertisement