రాష్ట్ర వైద్యబృందం ‘రుద్రారం’ పరిశీలన | state health department probation | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వైద్యబృందం ‘రుద్రారం’ పరిశీలన

Published Thu, Aug 11 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

రుద్రారంలో ఇంటింటికి తిరిగి పరిశీలిస్తున్న రాష్ట్ర వైద్య బృందం

రుద్రారంలో ఇంటింటికి తిరిగి పరిశీలిస్తున్న రాష్ట్ర వైద్య బృందం

మిరుదొడ్డి: జాతీయ పైలేరియా నివారణ వారోత్సవాల్లో భాగంగా  భూంపల్లి పీహెచ్‌సీ పరిధిలోని రుద్రారం గ్రామాన్ని గురువారం రాష్ట్ర వైద్య బృందం సభ్యులు  డీఈసీ, అల్బెండజోల్‌ మాత్రల పంపిణీపై ఇంటింటికి తిరిగి పరిశీలన జరిపారు.  పైలేరియా వారోత్సవాల్లో భాగంగా వ్యాధి నిర్మూలనకు ​‍క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు మాత్రలను ప్రతి ఒక్కరి చేత మింగించాల్సి ఉంది.  అలా కాకుండా ఇంటింటికి తూతూ మంత్రంగా మాత్రలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నట్లు రాష్ట్ర వైద్య బృందం పరిశీలనలో తేట తెల్లమైంది.

చాలా మటుకు ప్రతి ఇంటిలో  పంపిణీ చేసిన పైలేరియా మాత్రలను ప్రజలు వేసుకోకుండా ఉండటాన్ని వైద్య బృందం సభ్యులు రికార్డు చేశారు. కార్యక్రమంలో రీజినల్‌ హెల్త్‌ కార్యాలయం డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, స్టేట్‌ పైలేరియా కన్సల్టెంట్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌, భూంపల్లి పీహెచ్‌సీ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, హెల్త్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి ఎం. భాస్కర్‌, దుబ్బాక క్లస్టర్‌ సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ వెంకటయ్య, వైద్య సిబ్బంది రోజెట్టి, తార, కిరణ్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు సురేఖ, పద్మ, రేణుక, ఆశ వర్కర్లు అరుణ, సుమలత, సుజాత, స్వప్న, వీరమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement