చిట్టి బురల్రు..గట్టి ఆలోచనలు | study expo at saiteja school | Sakshi
Sakshi News home page

చిట్టి బురల్రు..గట్టి ఆలోచనలు

Published Fri, Nov 11 2016 9:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

study expo at saiteja school

  • ∙సాయితేజాలో ఆకట్టుకున్న స్టడీ ఎక్స్‌పో
  • ∙వివిధ అంశాలపై విద్యార్థుల ప్రదర్శనలు
  • రాయవరం :  
    తమ చిట్టి మెదడుతో పెద్ద ఆలోచనలు చేయడమే కాక సమాజంలోని అనేక సమస్యలకు తమదైన శైలిలో పరిష్కార మార్గాల్ని చూపించారు ఆ చిన్నారులు. తమను ప్రోత్సహించి, ప్రతిభను వెలికి తీస్తే అద్భుతాలు సృష్టించగలమని చాటారు.. రాయవరం సాయితేజా విద్యానికేత¯ŒS విద్యార్థులు. పాఠశాలలో రెండు రోజులుగా కొనసాగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది. 
    పాఠశాలకు చెందిన  ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి విద్యార్థులు 250 మంది  పవర్‌ హబ్, బయోడైవర్సిటీ, మన పరిసర విజ్ఞానం, భాషావిభాగం, మినీ మోడల్స్, కిడ్స్‌ జో¯ŒSగా విభజించి 90 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గురు, శుక్రవారాల్లో 800 మంది తల్లితండ్రులు, రాయవరం, వెదురుపాక, పందలపాక, రామవరం, సోమేశ్వరం హైస్కూళ్లు, పలు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు  ప్రదర్శనలను తిలకించారు.  
     కదిలే వాహనాల ద్వారా విద్యుదుత్పత్తి..
    కదిలే వాహనాల ద్వారా విద్యుత్‌ను ఏ విధంగా ఉత్పత్తి చేయవచ్చు అనే అంశాన్ని పదవ తరగతికి చెందిన కె.దుర్గాప్రశాంత్, భవాని సుధాకర్, వికాస్, మోహ¯ŒSభవాని ప్రయోగపూర్వకంగా వివరించారు. దీని వలన అతితక్కువ ఖర్చుతో విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేయవచ్చనే అంశం సందర్శకులను ఆకట్టుకుంది. 
    జెనెటిక్‌ ఇంజినీరింగ్‌..
    వంశపారంపర్యంగా వచ్చే చక్కెర వ్యాధిని తర్వాత తరాల వారికి రాకుండా ఎలా చేయవచ్చనే అంశాన్ని పదవ తరగతికి చెందిన కె.సుచిత్ర, సౌమ్య వివరించారు. పిండదశలో ఉండగానే డీఎ¯ŒSఏ స్ట్రక్చర్‌ను మార్చడం ద్వారా ఇది సాధ్యమని నిరూపించారు. 
    ఆటోమేటిక్‌ రైల్వేగేట్‌..
    సెన్సర్స్‌తో మానవరహితంగా రైలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా గేటు పడే విధానంపై తొమ్మిదవ తరగతికి చెందిన బి.శివరామ్, ప్రణయ్, దుర్గారెడ్డి, నిఖిల్‌ ప్రాజెక్టును తయారు చేశారు. రైల్లే గేట్ల వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్టు సందర్శకులను ఆలోచింపజేసింది. ఇలా పలు ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రాయవరం, బిక్కవోలు ఎంపీడీవోలు ఎ¯ŒS.వి.వి.ఎస్‌.మూర్తి, విజయభాస్కర్, ఎస్‌సై వెలుగుల సురేష్,  ఎంఈవో ఎ.నాగరాజు, కొమరిపాలెం సొసైటీ అధ్యక్షుడు తాడి అరవిందం, కేపీఆర్‌ ఫైర్టిలైజర్స్‌ డైరెక్టర్‌ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి(సత్తిబాబు) తదితరులు ప్రదర్శనలను తిలకించారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా స్టడీ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్లు పాఠశాల అకడమిక్‌ డైరెక్టర్‌ కర్‌?ర భానురేఖ సందీప్‌రెడ్డి తెలిపారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement