గవి చెట్టు నుంచి రాలుతున్న చక్కెర
డి.హీరేహాళ్ (రాయదుర్గం) : మండల కేంద్రమైన డి.హీరేహాళ్‌లోని ఎస్సీ కాలనీలో ఒక గవి చెట్టు నుంచి పంచదార రాలుతుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరి, వింతను ఆశ్చర్యంగా చూశారు. శుక్రవారం చెట్టు కింద పడిన తెల్లటి పదార్థాన్ని పరిశీలించారు. చెట్టు నుంచి పంచదార రాలుతున్నట్లు ఆనోటా ఈ నోటా తెలియడంతో డి.హీరేహాళ్‌లోని హిర్దేహాళ్ గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, చెట్టు వద్ద రాలిన చెక్కరను రుచి చూస్తున్నారు.
జన విజ్ఞాన వేదిక నాయకులు కెంచె లక్ష్మీనారాయణ కూడా అక్కడకు వచ్చి చెట్టు వద్ద రాలిన పంచదార లాంటి మిశ్రమాన్ని పరిశీలించారు. ఆ మిశ్రమాన్ని వేడినీళ్లలో వేసి, పాకాన్ని కూడా పట్టారు. చక్కెర వాసన వాస్తోంది. నోటిలో వేసుకున్నప్పుడు తీయదనంతో పాటు జిగురు లాంటి పదార్థంలా ఉందని ఆయన తెలిపారు.