అద్భుతమైన పండుగ.. బతుకమ్మ
Published Sat, Oct 1 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
పర్వతగిరి : తెలంగాణలో అద్భుతమైన పం డుగ బతుకమ్మ అని శాసనసభ స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారి అన్నారు. మండలం లోని చౌటపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాలుగా ఆంధ్ర పాలకులు తెలంగాణ పండుగలను కనుమరుగు చేసే కుట్ర పన్నారని అన్నారు. తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన సంస్కృతిని కాపాడేందుకు ప్రభుత్వం పండుగలను అధికారికం గా నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణ ఘ ట్టానికి వేదిక వరంగల్ బతుకమ్మ అన్నారు. రాష్ట్రంలో మొదటిసారి బతుకమ్మ పండుగ జ రుపుకున్న పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి రావటం పూర్వజన్మ సుకృతమని అన్నారు. సామాజికవేత్త శాంతికృష్ణ పూర్తి ఆధారాలతో నిరూపిస్తే చౌటపల్లి గ్రామాన్ని బతుకమ్మ జన్మస్థలంగా అధికారికంగా ప్రకటించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఎంపీ కవిత తర్వాత బతుకమ్మ విశిష్టత కోసం కృషి చేస్తున్న శాంతికృష్ణను ఎంపీ పసునూరి దయాకర్ అభినందించారు. వర్ధన్నపేట ఎమ్మేల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ చౌటపల్లిలో బతుకమ్మ ప్రాంగణం, శివాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాలకుర్తి ఎమ్మె ల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వంతో మాట్లాడి బతుకమ్మ జన్మ స్థలం గా చౌటపల్లి గ్రామాన్ని ఎంపిక చేసేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామ సర్పంచ్ వంగాల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో తెలంగాణ తల్లి రూపకర్త బీవీఆర్ చారి, అంతర్జాతీయ వ్యాఖ్యాత మగ్దుం మోహినోద్ది¯ŒS, ఎంపీపీలు రంగు రజితకుమార్, మార్నేని రవీందర్‌రావు, జడ్పీటీసీ మాదాసి శైలజా సు ధాకర్, కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, టీ ఆర్‌ఎస్ నాయకులు ఏడుదొడ్ల జితేందర్‌రెడ్డి, పల్లెపాటి శాంతిరత¯ŒSరావు, మేడిశెట్టి రాము లు, గోనె సంపత్, మాధవరావు, గోపాల్‌రావు, ఎంపీటీసీ మిట్టపల్లి పద్మ,దూజ పాల్గొన్నారు.
Advertisement
Advertisement