18న ‘ఇస్రో’ ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు | talent exams by isro | Sakshi
Sakshi News home page

18న ‘ఇస్రో’ ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు

Published Thu, Sep 15 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

talent exams by isro

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్, శ్రీహరికోట కేంద్రం వారు 8,9,10 తరగతుల విద్యార్థులకు ఈనెల 18న ఉదయం 9 గంటలకు స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో ప్రతిభా పోటీలు నిర్వహించనున్నారు. భారతీయ అంతరిక్ష విషయంగా 50 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది.

విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అక్టోబర్‌ 4,5 తేదీల్లో ‘ఇస్రో’ వారు బహుమతులు అందజేస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 17లోగా ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల ఫిజిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె. చంద్రశేఖర్‌రెడ్డి వద్ద పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 94402 47699  నంబర్‌లో సంప్రదించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement