ఉత్సాహంగా యువజనోత్సవాలు | youth festival in ssbn | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా యువజనోత్సవాలు

Published Sat, Jan 21 2017 10:30 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

ఉత్సాహంగా యువజనోత్సవాలు - Sakshi

ఉత్సాహంగా యువజనోత్సవాలు

అనంతపురం కల్చరల్‌ : ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో సాగుతున్న యువజనోత్సవాలు శనివారం ఉత్సాహంగా సాగాయి. వందల సంఖ్యలో యువతీయువకులు వివిధ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. క్రీడా, సాంస్కృతిక పోటీలను యువజన సంక్షేమ శాఖాధికారి వెంకటేశం, ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.నాగత్రిశూలపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడారు.

క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుని ఉన్నతంగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్లు డా.రమణ, డా.దేవసేన, ఆన్‌సెట్‌ శ్రీనివాసులు, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం కూడా పోటీలు కొనసాగుతాయని దేశ సంస్కృతికి సంబంధించిన ఫోక్‌డాన్స్, ఫోక్‌ సాంగ్‌ సోలో, గ్రూపు పోటీలు, ఫ్యాన్సీడ్రస్‌ కాంపిటీషన్, జిల్లా ప్రాముఖ్యతను తెలిపే ఫోటోగ్రఫీ పోటీలుంటాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement