పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడి దాడి | TDP leader's attack on the Secretary of the Panchayat | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడి దాడి

Published Mon, Feb 6 2017 10:50 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడి దాడి - Sakshi

పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడి దాడి

కేవీపల్లె : పింఛన్లు పంపిణీ చేయడానికి వెళ్లిన పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడు దాడి చేసిన సంఘటన మండలంలోని తువ్వపల్లె పంచాయతీలో ఆది వారం చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు కేవీపల్లె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తువ్వపల్లె పంచాయతీ కార్యదర్శి మణి ఆదివారం పింఛన్లు పంపిణీ చేయడానికి గ్రామానికి వెళ్లాడు. పెండేరివాండ్లపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు అంకమనాయుడి అవ్వకు పింఛను ఇవ్వడానికి వారి ఇంటి వద్దకు వెళ్లాడు.

ఆమె పొలం వద్దకు వెళ్లిందని, సాయంత్రం వరకు ఉండి పింఛను ఇచ్చి వెళ్లాలని అంకమనాయుడు దౌర్జన్యానికి దిగాడు. అంతటితో ఊరుకోకుండా మద్యం మత్తులో నానా దుర్భాషలాడుతూ చొక్కా పట్టుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాధితుడు మణి కేవీపల్లె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement