
బాలికపై దాడి.. టీడీపీ నాయకురాలి అరెస్టు
నూజివీడు(కృష్ణా): కిరాణ దుకాణంలో పనిచేసే బాలికపై దాడి చేసిన టీడీపీ నాయకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ టీడీపీ నాయకురాలు, జిల్లా బీసీ సంఘం అధ్యక్షురాలిగా పనిచేస్తున్న రాణిసింగ్ ఇటీవల స్థానిక సూపర్‌మార్కెట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సేల్స్‌గర్ల్‌తో వాగ్వాదం జరిగింది. రాణిసింగ్ ఆగ్రహంతో ఆమెను చెప్పుతో కొట్టారు.
ఈ ఘటనతో మనస్తాపం చెందిన బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇందుకు కారణం తెలుసుకున్న కుటుంబీకులు ఎస్సీ సంఘాల వారి మద్దతుతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ఉదయం రాణిసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.