జనగామ కోర్టుకు ఉగ్రవాది అబ్దుల్‌ఖాజా | terrorist abdul khaja remanded to Janagam court | Sakshi
Sakshi News home page

జనగామ కోర్టుకు ఉగ్రవాది అబ్దుల్‌ఖాజా

Published Tue, Aug 2 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

జనగామ కోర్టుకు ఉగ్రవాది అబ్దుల్‌ఖాజా

జనగామ కోర్టుకు ఉగ్రవాది అబ్దుల్‌ఖాజా

జనగామ : ఐఎస్‌ఐ ఉగ్రవాది అబ్దుల్‌ ఖాజాను పోలీసులు మంగళవారం జనగామ కోర్టు కు తీసుకొచ్చారు. చంచల్‌గూడ  జైలు నుంచి ఖాజాను నేరుగా జనగామ ప్రిన్సిపల్‌ ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజి స్ట్రేట్‌ టి.న ర్సిరెడ్డి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
 
అనంతరం ఎస్కార్టు సిబ్బంది ఉగ్రవాది ఖాజాను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 2011 నవంబర్‌ 11న వికారొద్దీన్‌ గ్యాంగ్‌ను వరంగల్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా జనగామ సమీపంలో బిర్యానీ కోసం ఎస్కార్టు పోలీసులతో అబ్దుల్‌ఖాజా గొడవకు దిగి దాడి చేశాడు. ఎస్కార్టు పోలీసుల ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఉన్న వికారొద్దీన్‌తో పాటు మరో నలుగురు ఆలేరు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే.   

Advertisement
Advertisement