- టీజీబీ చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ
- గుండ్లపల్లిలో టీజీబీ శాఖ ప్రారంభం
ఖాతాదారులకు మెరుగైన సేవలు
Published Thu, Sep 8 2016 8:07 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
బెజ్జంకి : ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు విస్తృతపరుస్తున్నట్లు ఆ బ్యాంకుల రాష్ట్ర చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ అన్నారు. మండలంలోని గుండ్లపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన శాఖను గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.10,682 కోట్లు, జిల్లావ్యాప్తంగా రూ.1919.13 కోట్ల టర్నోవర్‌తో బ్యాంకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు పంటరుణాలు, వ్యాపారులకు, మహిళ సంఘాలకు, విద్యార్థులకు విద్య రుణాలతో పాటు వాహనాల రుణాలు కూడ ఇవ్వనున్నట్లు వివరించారు. అలాగే మిషన్‌కాకతీయలో చెరువుల మట్టిని తరలించేందుకు ఎకరాకు రూ.5 వేలు రైతులకు రుణసౌకర్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. జీఎం ఎస్.పాదం, ఆర్‌ఎం రవీందర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీపాద్, మేనేజర్ అనిల్‌రెడ్డి, క్యాషియర్ వేణుగోపాల్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచులు కృష్ణమోహన్‌రెడ్డి, గువ్వ వీరయ్య, ఎంపీటీసీ కొర్వి సంధ్యారాణి, ఉపసర్పంచ్ కాల్వ పెద్ద కొమురయ్య, ముల్కనూర్, రీజీనల్ ఆఫీసర్ ఐలయ్య, అల్గునూర్ బ్రాంచ్‌ల మేనేజర్లు సతీశ్, వెంకటస్వామి పాల్గొన్నారు.
Advertisement
Advertisement