విష జ్వరానికి చిన్నారి బలి | The baby sacrificed to the toxic fever | Sakshi
Sakshi News home page

విష జ్వరానికి చిన్నారి బలి

Published Wed, Jun 14 2017 10:17 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

విష జ్వరానికి చిన్నారి బలి

విష జ్వరానికి చిన్నారి బలి

యల్లనూరు(శింగనమల) : యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో అలేఖ్య, రమాకాంత్‌రెడ్డి దంపతుల కుమార్తె యశశ్విని(5) విష జ్వరంతో బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లిలోని అమ్మమ్మ ఇంటికెళ్లిన చిన్నారికి సోమవారం జ్వరం రావడంతో మంగళవారం ఉదయం తిమ్మంపల్లికి తీసుకువచ్చారు.

అదే రోజు మధ్యాహ్నం జ్వరం విపరీతంగా రావడంతో వైద్యం కోసం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం చిన్నారిని బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement